Posts

Showing posts from January, 2017

పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు

Image
మన శరీరంలో చేరిన అనేక మలిన పదార్థాలు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. అవి ఒంటిలో పోగుబడినా కొద్దీ పలు రకాల అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి. బీపీ, షుగర్, జాండీస్, హార్ట్ డిసీజెస్ వ్యాపింపజేసేందుకూ కారణమవుతాయి. వాటిని అప్పుడప్పుడూ పారదోలుతుంటే బాడీ క్లీన్ అవుతుంటుంది. టాక్సిన్స్ పోవడంతో పాటుగా జీర్ణక్రియ మెరుగుపడితే  ఆరోగ్యంసెట్ రైట్ అవుతుంది. ఈ ప్రక్రియకు జీరా తేనెల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. సాఫ్ చేసి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బరువునూ తగ్గిస్తుంది. తేనె జిలకర మిశ్రమం తయారీ ఇలా… https://learnmyown.blogspot.in/ కావాల్సిన పదార్థాలు: జిలకర- 2టీ స్పూన్లు తేనె- 2టీ స్పూన్లు నీళ్లు- 1కప్పు తయారీ విధానం: ఒక కప్పు నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జిలకర వేయాలి. 10నిముషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ తో  తేనె కలుపుకోవాలి. తర్వాత తాగవచ్చు. ప్రయోజనాలు: * రక్తంలో పేరుకున్న మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీంతో శరీరానికి అనేక వ్యాధుల వచ్చే ప్రమాదం తప్పుతుంది. * జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం..

ఇలా పనిచేస్తే.. 15ఏళ్లలో చనిపోతారట తస్మాత్ జాగ్రత్త

Image
రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్ల తరబడి అలాగే పనిచేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే.. ఎందుకంటేఅలా కూర్చుని కూర్చుని చివరకు అలాగే పోతారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిశోధనలు తేల్చిందేమంటే రోజుకు మూడు గంటలపాటు కూర్చునే వారితో పోల్చితే, 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40శాతం ఎక్కువగా ఉన్నాయట. అంటేకాదు రోజూ రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 20శాతం మేర తగ్గుతుంది. ఏళ్ల తరబడి గంటలపాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు గంటపాటు వ్యాయామం చేసినా సరిపోదట. కేవలం ఒక్కరోజు అదేపనిగా గంటల తరబడి కూర్చుంటే చాలు అది  ఇ న్సులిన్ పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో    ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల కేలరీలను ఖర్చుచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా తక్కువ స్థాయిల్లో తాజా రక్తం, ఆక్సిజన్ రావడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. వారంలో 23 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్

చిన్న, చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని, ఆర్దిక పరిస్థితులను మార్చేస్తాయి.. లక్ష్మీదేవి ఆగ్రహించే ఈ పనులు అసలు చేయకూదడట

సాధారణంగా మన ఇంటలో పెద్ద వాళ్లు సాయ o త్రం అలా చేయకూడదు.. ఇలా చేయకూడదని సూచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోంకూడా.. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పనులు లక్ష్మీదేవిని ఆగ్రహించేలా చేస్తాయని చెపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ ఇంటిని సంపద, శ్రేయస్సు ఎప్పటికి వదలిపోదని అంటారు. శాస్త్రాలు, పురాణాలు నమ్మేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు లక్ష్మీదేవికి ఎలాంటి సమయంలో ఆగ్రహం వస్తుందో శాస్త్రం చెపుతోంది. అవేంటో చూద్దాం. * సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఉడవటంవల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లేనట. * సాయంత్రం సమయంలో శారీరకంగా కలవటం వంటి పనులు మంచిది కాదట. కలవటం వల్ల దురదృష్టం వెన్నడుతుందట. * సాయంత్రం పూట నిద్ర పోకూడదట. ఇలా చేస్తే శరీరం రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. * తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేయాలి. లేక పోతే శని, చంద్రుల దుష్ప్రభావం మీద పడుతుందట. * తిన్న వెంటనే ప్లేట్లు కడగటంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం. సంపద, శ్రేయస్సు పొందొచ్చట. * సూర్యాస్తమయం జరిగేప్పుడు చదువుకోకూడద

కేంద్ర కొత్త నిర్ణయం …క్యాష్ విత్‌డ్రా చేస్తే ఇకపై ట్యాక్స్‌

Image
పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా తీసుకోనున్న నిర్ణ‌యాల్లో భాగంగా నగదు చెల్లింపులపై నిబంధ‌న‌లు, పన్నులు విధించాలని భావిస్తోంది. డిజిటల్‌ లావాదేవీలను మరింత పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాష్‌ ట్యాక్స్‌ను తీసుకురాబోతుందని సమాచారం. వ‌చ్చేనెల 1వ తేదీనే కేంద్ర ప్ర‌భుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని చూస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ బ‌డ్జెట్ సంద‌ర్భంగానే క్యాష్‌ ట్యాక్స్ గురించి వివ‌రించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.ఈ నిర్ణ‌యం ప్రకారం ప్ర‌జ‌లు త‌మ‌ బ్యాంకు అకౌంట్ల నుంచి నిర్దేశించిన పరిమితిని మించి డ‌బ్బును విత్‌ డ్రా చేసుకుంటే వారిపై కొంతమేర పన్ను పడే అవకాశం ఉంది. అయితే ఆ పన్ను లిమిట్ ఎంత ఉండబోతుందంటే.. సిట్ సూచనల ప్రకారం 3 లక్షల రూపాయ‌ల‌కు మించిన నగదు లావాదేవీలను, వ్యక్తిగతంగా 15 లక్షల కంటే ఎక్కువగా నగదు కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రానికి సూచ‌న‌లు చేసింది. ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీఫామ్‌ కమిషన్‌(టార్క్‌) కూడా బ్యాంకింగ్‌ క్యాష్‌ ట్రాన్సాక్షన్ ప

పిల్లలు అదృశ్యం అయితే ఇలా చేయండి

Image
   దారి తప్పిన పిల్లలు ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని దగ్గరలోని ఆధార్ కేంద్రం వద్దకు తీసుకువెళ్ళండి.వారి వేలిముద్రలు లేదా ఐరిస్ ద్వారా వెంటనే వారి అడ్రస్ ట్రేస్ చేస్తారు.

గుండె నొప్పి వచ్చే ముందు కనబడే కొన్ని లక్షణాలు

Image
హార్ట్ అటాక్ , దీని గురించి ఎవ్వరికీ సెపరేటుగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది తమ వృద్ధాప్య దశలో ఎదుర్కోనే సమస్య ఇది. కాని దీనిని కొంత మంది లో కొన్ని లక్షణాలు( ఆరోగ్య సమస్యలు) ద్వారా కనిపెట్టవచ్చు.హార్ట్ అటాక్ ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.మరి ఏ లక్షణాల ద్వారా హర్ట్ అటాక్ ను పసిగట్టవచ్చో ఇప్పుడు చుద్దాం. 1. అలసట, హార్ట్ అటాక్ గురయ్యే ముందు అలసట ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో రక్త ప్రవాహా వేగం తగ్గడమే. సో మీరు గాని అలసట గా ఫీలయితే వీలైనంత వరకు వైద్యుడుని కలవడం మంచిది. 2.మెడ,గొంతు, దవడ భాగంలో చలా టైట్ గా అనిపించడం. 3.జీర్ణా సమస్యలు,వాంతులు,కడుపులో అసౌకర్యంగా వున్న ఫీలింగ్.. 4.ఛాతిలో నొప్పి, ముఖ్యంగా గుండె లో మంటగా వున్న ఫీలింగ్ .. వీటిలో మీరు దేనితోనైనా బాధపడితే వైద్యులను కలవడం చాలా ఉత్తమం.

వాటర్ ఎక్కువగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Image
1) మనలో చాలా మంది వాటర్ తాగడాన్ని లైట్ గా తీసుకుంటారు .అంతే కాకుండా వాటర్ కి బదులు రకరకాలు పానీయాలు, మద్యం,ఆల్కహాలు తీసుకుంటారు. 2) కాని శరీరంలో వాటర్ లేకపోతే శరీరంలో ఫంక్షన్స్ కరెక్ట్ గా జరగవు. అంతే కాకుండా శరీరంలో విషపదార్ధాలు ఎక్కువగా చేరతాయి. అలాగే డిహైడేషన్ సమస్యలను దూరం చేస్తుంది. 3) వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జబ్బులు ఎక్కువగా రావు. అలాగే బరువు తగ్గడానికి కూడా నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. 4) అలాగే నీటిని సేవించడం వల్ల ఇతరపానీయాల మీద ఆసక్తి పోతుంది. నీరు తక్కువగా తాగడం వల్ల ఎక్కువగా అలసట ఫీల్ అవుతాయి. 5) అందువల్లే అలసట గా ఫీల్ అయినప్పుడు వాటర్ ను ఎక్కువగా తాగాలి. 6) అలాగే వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల శరీర కాంతి చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చర్మ వైద్యులు చెప్తున్నారు.

అరటి పండును తినడం వల్ల కలిగె ప్రయోజనాలు

Image
ఎంతో మంది రోగులకు, బలహీనులకు, వెంటనే శక్తి రావడానికి దీనినే ప్రధాన ఆహారంగా సూచిస్తారు పెద్దలు,వైద్య నిపుణులు.దీనిలో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం,విటమిన్స్ చాలా అధికంగ వుంటాయి. అందుకే దీనికే మొదటి ప్రయారిటీ ఇస్తారు అందరూ.ఇకపోతే దీని రోజు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను మన జీవితంలోకి రాకుండా చేసుకోవచ్చు. అవేంటో ఒక సారి చూద్దాం. 1.మలబద్దకం, దీనిలో ఫైబర్ మల బద్దకాన్ని దరి చేరనివ్వదు. 2.దీనిలోని పోటాషియం , మినరల్స్ ఎముకలను గట్టిగా చేయటమే కాకుండా మనలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. 3.అరటిపండులోని పోటాషియం ఎక్కువగా ,సోడియం తక్కువగా దొరకటం వల్ల మన బ్లడ్ ప్రెజర్ని తగ్గించడమే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ లను తగ్గిస్తుంది. 4.జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 5.దీనిలో వుండే ఐరన్ , అనీమియాను దూరం చేస్తుంది. 6.ఇది మనలోని గ్యాస్ట్రిక్ జ్యూస్లను తొలగించి,ఎసిడిటీ,అల్సరు బారి నుండి కాపాడుతుంది. 7.దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా దొరకటం వల్ల కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. 8.గుండె సంబధిత వ్యాధులనూ దూరం చేస్తుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించే దివ్య ఔషధం

Image
1) ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ 2) తులసి ఆకుల పేస్ట్ - 1 స్పూన్ 3) నిమ్మరసం -  1స్పూన్ 4) తేనే - 1స్పూన్ తయారీ విధానం : 1) పైన పేర్కొన్న నాలుగు పదార్ధాలను కలిపి డ్రింక్ తయారు చేసుకోవాలి. దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున తీసుకొని అరగంట వరకు ఏమీ తినకూడదు. నెల నుండి 3 నెలల వరకు క్రమంగా త్రాగాలి. 2) ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలు , నూనె వస్తువులు తగ్గించాలి. డాక్టర్  లేదా డైటీషియన్ సలహా మేరకు మందులు వాడుకొని , ఎక్కువ మొత్తంలో వాటర్ త్రాగుతూ ఉండాలి.  3) తరచుగా స్టోన్స్ ఏర్పడేవారు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలిసి సంబంధిత కోర్స్ వాడుకోవాలి. అశ్రద్ధ చేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. 

చర్మ సౌందర్యం మెరుగుపరిచే కలబంద ప్రయోజనాలు

Image
పసుపు, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని రాసుకుంటే ముఖం పై వున్న మొటిమలు పోతాయి. అలాగే చర్మపు ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. కీరదోసకాయ రసం లేదా నిమ్మరసం, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని ప్యాక్ కింద వేసుకుంటే చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. దీని వల్ల చర్మం స్మూత్ , అందంగా తయారవుతుంది. టమోటా జ్యూస్, దీనిని కలబందలో కలుపుకోని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే విటమిన్ సి, ఇ లు బాగా అంది చర్మం హెల్తీగా, కాంతివంతంగా కనబడుతుంది. బియ్యం పిండి, దీనిని కలబందలో మిక్స్ చేసి రాసుకుంటే చర్మం పై డెడ్ సెల్స్ పోతాయి. బాగా పండిన అరపండు గుజ్జు, దీనిలో కలబంద పేస్టును కలిపి ప్యాక్ గా వేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. అంటె సాగే గుణాన్ని ( ముడతలు రావడాన్ని) తగ్గిస్తుంది క్యారెట్ జ్యూస్, దీనిని అలోవెర జెల్ లో కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి శరీరం కాంతివంతంగా తయారవుతుంది.

పరగడుపున నీళ్లు త్రాగడం వల్ల కలిగే ఉపయోగాలు

Image
పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరం. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

చుండ్రు తగ్గించే కొన్ని చిట్కాలు

Image
*ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఎదో ఒక సమయంలో చుండ్రుతో బాధపడుతూ ఉంటారు. మేము సూచిస్తున్న ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ పరిష్కారం అందిస్తుంది. *వేప మరియు నిమ్మ లో ఉండే యాంటీ బాక్టీరియా , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. *కొన్ని వేపాకులను నీళ్లలో  బాగా ఉడికించి పేస్ట్ చేసుకోవాలి , దానికి ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తల మొత్తం పట్టించాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయ కాంబినేషన్ లో లభించే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. * ఇలా మీరు ఓపికతో వారానికి రెండు మూడు సార్లు దీనిని పాటించాలి. మంచి ఫలితాన్ని మీరు గమనిస్తారు.

గాస్టిక్ సమస్యలకు కొన్ని చిట్కాలు

Image
*అల్లంలో ఉండే ఔషధ గుణాలు , మజ్జిగలో ఉండే కూలింగ్ లక్షణాలు పొట్టలో గ్యాస్ , అసిడిటీ తగ్గించడంలో గొప్పగా పని చేస్తాయి. *ఒక గ్లాస్ మజ్జిగలో రెండు ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకొంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. *గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు రెండు గ్లాసులు త్రాగాలి. *ప్రతి రోజు గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆహారంలో కారం , పులుపు , మసాలాలు , మాంసాహారం తగ్గించి తీసుకోవాలి. *గ్యాస్ సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ కాలం గ్యాస్ సమస్య ఉన్నవారికి పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. *దగ్గర్లో డాక్టర్ ని సంప్రదించి మందులు వాడుకొని , డైట్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. *ఎక్కువ మొత్తంలో నీటిని త్రాగుతూ ఉండాలి. సమయానికి భోజనం చేయాలి.

మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్

Image
రక్తపోటు (హైబీపీ) అనే అంశం కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. గుండెజబ్బులకు దారితీసేందుకు దోహదం చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో అత్యంత ప్రధానమైనది డయాబెటిస్. దూమపానం మరో పెద్ద రిస్క్ ఫ్యాటర్. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇటీవల పెరిగింది. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా పెరుగుతోంది. ఇటీవల చిన్న వయసులో స్థూలకాయం వస్తుండటం మన దేశ వాసుల్లో పెరుగుతోంది. ఈ అంశం కూడా చిన్నవయసులో వచ్చే గుండె సమస్యలకు దారితీస్తోంది. ఒత్తిడి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ఓ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.కాబట్టి వీలైనంత వరకు మితిమీరిన ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం. కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉంటే వంశపారంపర్యం అనే అంశాన్ని ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు. మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం కూడా పెరగడంతో గుండెజబ్బులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇటీవల నగరీకరణ పెరగడంతో జీవనశైలిలోని మార్పులు అంటే పనిగంటలు, పనుల్లో ఒత్తిడి పెరగడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి వాటి వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఈ తరం వృత్తులలో ఎక్కువగా శరీరానికి పెద్దగా అలసట కలిగి

చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడానికి కారణాలు

Image
చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం ... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇది గుండెజబ్బుల తీవ్రతను తెలిపే విషయం. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం కోసమే చాలా అవసరము . ‘ఫలానా వారికి గుండెజబ్బుట, గుండెపోటు వచ్చిందట’ అని వినిపించడం ఈమధ్య మామూలయిపోయింది. ఆ కబురు చెప్పీచెప్పగానే ఎదుటివారు ‘అరె... ఆయనది చిన్న వయసే కదా’ అని స్పందించడం కూడా ఎక్కువయ్యింది. అంటే... గుండెజబ్బులు ఒక వయసు దాటిన తర్వాత వస్తాయనేది గతంలోని అభిప్రాయం. అభిప్రాయాలు వేరు... అనుభవాలు వేరు. అనుభవం వల్ల అభిప్రాయాలు మారతాయి. గుండెజబ్బుల గురించి ఇటీవల జరుగుతున్న అనుభవాలు, పెరుగుతున్న కేసులు అభిప్రాయాలను మారేలా చేస్తున్నాయి. పాశ్చాత్యులు, ఇ

నిజనికి జనవరి ఒకటి కధా ఎమిటొ మీకు తెలుసా?

Image
ఈ మెసేజ్ జనవరి ఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం. అసలీ జనవరి 1 కథ ఏంటి? ఏప్రిల్ ఫూల్ ఎందుకొచ్చింది? నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. అది వారి ప్రేమకు తార్కాణం. కానీ నేనిప్పటిదాకా నాకు బుద్ధొచ్చాక నేనైనేను ఎవరికీ చెప్పలేదు. (నా పై అధికారులకు తప్ప). ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు. ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు. ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం. ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం