పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు

మన శరీరంలో చేరిన అనేక మలిన పదార్థాలు ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. అవి ఒంటిలో పోగుబడినా కొద్దీ పలు రకాల అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి. బీపీ, షుగర్, జాండీస్, హార్ట్ డిసీజెస్ వ్యాపింపజేసేందుకూ కారణమవుతాయి. వాటిని అప్పుడప్పుడూ పారదోలుతుంటే బాడీ క్లీన్ అవుతుంటుంది. టాక్సిన్స్ పోవడంతో పాటుగా జీర్ణక్రియ మెరుగుపడితే ఆరోగ్యంసెట్ రైట్ అవుతుంది. ఈ ప్రక్రియకు జీరా తేనెల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. సాఫ్ చేసి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బరువునూ తగ్గిస్తుంది. తేనె జిలకర మిశ్రమం తయారీ ఇలా…https://learnmyown.blogspot.in/https://learnmyown.blogspot.in/
కావాల్సిన పదార్థాలు:
జిలకర- 2టీ స్పూన్లు
తేనె- 2టీ స్పూన్లు
నీళ్లు- 1కప్పు
తయారీ విధానం:
ఒక కప్పు నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జిలకర వేయాలి. 10నిముషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ తో 
తేనె కలుపుకోవాలి. తర్వాత తాగవచ్చు.
ప్రయోజనాలు:
* రక్తంలో పేరుకున్న మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీంతో శరీరానికి అనేక వ్యాధుల వచ్చే ప్రమాదం తప్పుతుంది.
* జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేసి అనేకరకాల జీర్ణ సంబంధ సమస్యలను దూరంగా ఉంచుతుంది.
* ఈ మిశ్రమం మలబద్దకాన్ని నివారించే ఎఫెక్టివ్ రెమిడీ. కాబట్టి ఇది తాగితే మోషన్ సాఫ్ అవుతుంది.
* జీరాలో క్యుమినల్ డిహైడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా, శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
* జీరా, తేనె మిశ్రమంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో ఎలక్ట్రోలైట్స్ ని బాలెన్సు చేస్తుంది. దీంతో బ్లడ్ ప్రజర్ (BP) కంట్రోల్ లో ఉంటుంది.
* ఈ న్యాచురల్ డ్రింక్ లో యాంటీ ఇన్ఫమేటరీ గుణాలుంటాయి. ఇది శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.
* మిశ్రమంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ ను పెంచడం వల్ల అనీమియా (రక్తహీనత)ను నివారించొచ్చు.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

What is keyboard