మన దేశంలో రిస్క్ ఫ్యాక్టర్స్
రక్తపోటు (హైబీపీ) అనే అంశం కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.
గుండెజబ్బులకు దారితీసేందుకు దోహదం చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌లో అత్యంత ప్రధానమైనది డయాబెటిస్.
దూమపానం మరో పెద్ద రిస్క్ ఫ్యాటర్.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఇటీవల పెరిగింది. దీంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా పెరుగుతోంది.
ఇటీవల చిన్న వయసులో స్థూలకాయం వస్తుండటం మన దేశ వాసుల్లో పెరుగుతోంది. ఈ అంశం కూడా చిన్నవయసులో వచ్చే గుండె సమస్యలకు దారితీస్తోంది.
ఒత్తిడి కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్‌కు ఓ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్.కాబట్టి వీలైనంత వరకు మితిమీరిన ఒత్తిడికి దూరంగా ఉండటం అవసరం.
కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు ఉంటే వంశపారంపర్యం అనే అంశాన్ని ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు.
మన దేశంలో సగటు ఆయుఃప్రమాణం కూడా పెరగడంతో గుండెజబ్బులు ఎక్కువగా బయటపడుతున్నాయి.
ఇటీవల నగరీకరణ పెరగడంతో జీవనశైలిలోని మార్పులు అంటే పనిగంటలు, పనుల్లో ఒత్తిడి పెరగడం, నిద్ర వ్యవధి తగ్గడం వంటి వాటి వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయి.
ఈ తరం వృత్తులలో ఎక్కువగా శరీరానికి పెద్దగా అలసట కలిగించనివే ఉంటున్నాయి. ఫలితంగా దేహానికి తగినంత వ్యాయామం ఉండట్లేదు. దీంతో చిన్న వయసులోనే హార్ట్ డిసీజెస్, హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి
Comments
Post a Comment
dont use unformal language