చిన్న, చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని, ఆర్దిక పరిస్థితులను మార్చేస్తాయి.. లక్ష్మీదేవి ఆగ్రహించే ఈ పనులు అసలు చేయకూదడట

సాధారణంగా మన ఇంటలో పెద్ద వాళ్లు సాయoత్రం అలా చేయకూడదు.. ఇలా చేయకూడదని సూచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోంకూడా.. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పనులు లక్ష్మీదేవిని ఆగ్రహించేలా చేస్తాయని చెపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఆ ఇంటిని సంపద, శ్రేయస్సు ఎప్పటికి వదలిపోదని అంటారు. శాస్త్రాలు, పురాణాలు నమ్మేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు లక్ష్మీదేవికి ఎలాంటి సమయంలో ఆగ్రహం వస్తుందో శాస్త్రం చెపుతోంది. అవేంటో చూద్దాం.
* సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఉడవటంవల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లేనట.
* సాయంత్రం సమయంలో శారీరకంగా కలవటం వంటి పనులు మంచిది కాదట. కలవటం వల్ల దురదృష్టం వెన్నడుతుందట.
* సాయంత్రం పూట నిద్ర పోకూడదట. ఇలా చేస్తే శరీరం రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.
* తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేయాలి. లేక పోతే శని, చంద్రుల దుష్ప్రభావం మీద పడుతుందట.
* తిన్న వెంటనే ప్లేట్లు కడగటంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం. సంపద, శ్రేయస్సు పొందొచ్చట.
* సూర్యాస్తమయం జరిగేప్పుడు చదువుకోకూడదు. అంటే కాస్త ఆశ్యర్యమే అయినా పురాణాల ప్రకారం సూర్యాస్తమయం జరిగేప్పుడు చదువు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుందట.
లక్ష్మీదేవి నివాసాలు..
నరుల పాదాలలో లక్ష్మి ఉంటే గృహాన్నిస్తుంది. తొడలపై వుంటే వస్త్రాలను, రత్నాలను, నానావిధ ద్రవ్యాలను ఇస్తుంది. గుహ్యస్థానంలో వుంటే కళత్రాన్ని, ఒడిలో వుంటే మంచి సంతానాన్ని ఇస్తుంది. హృదయంపైన ఉంటే కోరిన కోరికలను తీరుస్తుంది. కంఠంపై వుంటే కంఠాభరణాలను ఇస్తుంది. ప్రవాసంలో ఉన్నవారికి ఆత్మీయులతో, భార్యతో కలయికనిస్తుంది. నోటిలో వుంటే మధర వాక్కును, మధుర ఆహారాన్ని, లావణ్యాన్ని, ఆజ్ఞ చెల్లుబాటును, కవిత్వాన్ని ఇస్తుంది. లక్ష్మి తలపై ఉంటే వానిని వదలి వేరేవారిని ఆశ్రయిస్తుంది. అంటే జీవితంలో మిగిలిన వాటికంటే ధనానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తే ఆ ధనం కూడా నిలబడదని హెచ్చరిక! శుచి, శుభ్రతలే ఆ అమ్మ నివాసాలు.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

What is keyboard