ఇలా పనిచేస్తే.. 15ఏళ్లలో చనిపోతారట తస్మాత్ జాగ్రత్త

రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్ల తరబడి అలాగే పనిచేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే.. ఎందుకంటేఅలా కూర్చుని కూర్చుని చివరకు అలాగే పోతారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు అంతర్జాతీయ పరిశోధనలు తేల్చిందేమంటే రోజుకు మూడు గంటలపాటు కూర్చునే వారితో పోల్చితే, 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40శాతం ఎక్కువగా ఉన్నాయట. అంటేకాదు రోజూ రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 20శాతం మేర తగ్గుతుంది. ఏళ్ల తరబడి గంటలపాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు గంటపాటు వ్యాయామం చేసినా సరిపోదట. కేవలం ఒక్కరోజు అదేపనిగా గంటల తరబడి కూర్చుంటే చాలు అది
Working, Man, Sitting, Computer, Programmer, Engineer ఇన్సులిన్ పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో   ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల కేలరీలను ఖర్చుచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా తక్కువ స్థాయిల్లో తాజా రక్తం, ఆక్సిజన్ రావడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. వారంలో 23 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని పరిశోధనల్లో వెల్లడైంది. ఆఫీసులో గంటల కొద్దీ సమయం కూర్చున్న దానికి తోడు ఇంటికి చేరుకున్నాక టీవీలు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి సిట్టింగ్ వేయడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతోందట. అందుకే లేవాలి.. ప్రతి రెండు గంటలకు ఓసారైనా లేచి కదలాలి. పని మధ్య మధ్యలో లేవడం, అటూ ఇటు తిరగడం వంటివి చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి తోడు రోజూ ఉదయం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

What is keyboard