చర్మ సౌందర్యం మెరుగుపరిచే కలబంద ప్రయోజనాలు
పసుపు, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని రాసుకుంటే ముఖం పై వున్న మొటిమలు పోతాయి. అలాగే చర్మపు ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది.
కీరదోసకాయ రసం లేదా నిమ్మరసం, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని ప్యాక్ కింద వేసుకుంటే చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. దీని వల్ల చర్మం స్మూత్ , అందంగా తయారవుతుంది.
టమోటా జ్యూస్, దీనిని కలబందలో కలుపుకోని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే విటమిన్ సి, ఇ లు బాగా అంది చర్మం హెల్తీగా, కాంతివంతంగా కనబడుతుంది.
బియ్యం పిండి, దీనిని కలబందలో మిక్స్ చేసి రాసుకుంటే చర్మం పై డెడ్ సెల్స్ పోతాయి.
బాగా పండిన అరపండు గుజ్జు, దీనిలో కలబంద పేస్టును కలిపి ప్యాక్ గా వేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. అంటె సాగే గుణాన్ని ( ముడతలు రావడాన్ని) తగ్గిస్తుంది
క్యారెట్ జ్యూస్, దీనిని అలోవెర జెల్ లో కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి శరీరం కాంతివంతంగా తయారవుతుంది.
Comments
Post a Comment
dont use unformal language