పరగడుపున నీళ్లు త్రాగడం వల్ల కలిగే ఉపయోగాలు
పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.
ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరం.
అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్ రిఫ్లక్స్ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్ డైల్యూట్ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
Comments
Post a Comment
dont use unformal language