రంగు వేసిన 3 రోజులకే తెల్లజుట్టు... చిరాగ్గా ఉంటుందా...? కరివేపాకు నూనెతో....

Image result for wrinklesతలకి రంగు వేసిన రెండు మూడు రోజులకే తెల్ల జుట్టు క‌న‌ప‌డ‌టం వ‌ల్ల చిరాకుగా ఉంటుంది. న‌ల్ల‌టి జుట్టుకు క‌రివేపాకు నూనెను వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. క‌రివేపాకు నూనెను ఈవిధంగా త‌యారుచేసుకోవ‌చ్చు. ఒక కట్ట కరివేపాకుల్ని తీసుకుని, శుభ్రం చేసి ఎండబెట్టుకోవాలి. ఆకులు ముదురు గోధుమ రంగుకి వచ్చాక మెత్తగా పొడి చేయాలి. నాలుగు టీస్పూన్ల కరివేపాకు పొడిని 200 మిల్లి లీటర్ల కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనెలో వేసి రెండు నిమిషాలు వేడి చేయాలి.

ఈ నూనె చల్లారాక వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెని వారానికి రెండుసార్లు తలకు పట్టించాలి. చేతి వేళ్లని గుండ్రంగా తిప్పుతూ మెల్లగా మర్దనా చేస్తే మాడులోకి నూనె ఇంకుతుంది. 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. క్రమంగా ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లబడే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ తరువాత జుట్టుకు ఆవిరి పడితే మాడు మీద రంధ్రాలు తెరుచుకుని నూనె బాగా లోపలికి ఇంకి, ఫలితం త్వరగా కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

What is keyboard

The Four Lobes of the Human Brain