JIO సరికొత్త ధమాఖా , లాంచ్ చేసిన హ్యాపీ న్యూ ఇయర్ 2018 ప్లాన్..
జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్త ప్లాన్ ని ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ధర 299 రూపాయలు. మరింత డేటా కావాలనుకునే వినియోగదారులకు జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు ప్రతిరోజూ 2GB 4G డేటాను పొందుతారు. అలాగే, ఉచిత లోకల్ మరియు STD కాల్స్ మరియు జియో యాప్స్ కి కూడా యాక్సిస్ లభిస్తుంది .వినియోగదారులకు ఈ కొత్త జియో ప్లాన్ డిసెంబర్ 23 నుండి అందుబాటులో ఉంది, అనగా వినియోగదారులు ఈ ప్లాన్ ను పొందగలరు. దీనితో పాటుగా జియో 199 రూపాయలకు ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది.
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను ప్రదర్శించడంతో పాటు, జియో ప్లాన్ లలో కొన్ని అప్డేట్ చేయబడ్డాయి. జియో తన 149, 399, 459, 499 మరియు 509 రూపాయల ప్రీపెయిడ్ డేటా ప్లాన్ లను సవరించింది. ఈ ప్లాన్ లు ఇప్పుడు 64 Kbps కంటే అధిక వేగంతో 128 Kbps వద్ద డేటాను అందిస్తాయి
Comments
Post a Comment
dont use unformal language