క్యాలీఫ్లవర్‌, బంగాళాదుంపల కర్రీ




 కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్‌- చిన్నది (పువ్వులు విడదీసి పెట్టుకోవాలి), బంగాళాదుంపలు- రెండు పెద్దవి, నూనె- మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్లు, మినపప్పు- టేబుల్‌ స్పూను, కొత్తిమీర- రెండు స్పూన్లు, మెంతులు- అర టీస్పూను, ఆవాలు- అర టీ స్పూను, ఎండుమిరపకాయలు- మూడులేదా నాలుగు, కొబ్బరి పొడి- అరకప్పు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, ఉల్లిపాయ- మీడియం సైజుది (ముక్కలుగా చేసుకోవాలి), చింతపండు గుజ్జు- టేబుల్‌ స్పూను, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, ధనియాలు- టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: బాండీ లేదా మందపాటి గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకుని అనంతరం దీనికి కొబ్బరి పొడి జతచేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. బంగాళాదుంపలు ముక్కలుగా చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మరికొద్దిగా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకున్న తరువాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కొద్దిగానీరు, చింతపండుగుజ్జు వేసి ఉడికించాలి. ముక్కలు బాగా వేగిన తరువాత మసాలా పొడి, కొత్తిమీర ఆకులు వేసుకొని దింపేయాలి.

Comments

Popular posts from this blog

Rawl plug jumper

What is keyboard